ప్రజలు క్రీస్తు బోధనల ప్రకారం సమాజంలో మెలగాలి: బల్గూరి స్నేహ దుర్గయ్య
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 25( ప్రతినిధి మాతంగి సురేష్): సంఘస్తులు క్రీస్తు బోధనల ప్రకారం సమాజంలో మెలిగి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలని గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు.గణపవరం గ్రామంలోని క్రీస్తు సంఘం చర్చ్ లో మేరీ క్రిస్మస్ వేడుకలను పాస్టర్ శాంత వర్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య పాల్గొని కేక్ కట్ చేసి గణపవరం గ్రామ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ సందేశం ప్రపంచమంతా విస్తరించాలని, ఆయన దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచ దేశాలు మొత్తం జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సానికొమ్ము తరుణ్ రెడ్డి, వార్డు మెంబర్ బండి చినకోటయ్య, పోశం శ్రీను, ముసిని స్వప్న శ్రీనివాస్, బాలే బోయిన విద్యాసాగర్, అమరబోయిన లక్ష్మయ్య, సిహెచ్ ఆస్సానమ్మ, బి సామ్రాజ్యం, బి కుమారి, ఈ విజయ వరాల్ రెడ్డి, బుర్ర కొండలు, పొట్ట రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.



