Sunday, December 28, 2025
[t4b-ticker]

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం

Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్): కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణ కేంద్రంలోని 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మేధావులు, మహానుభావుల నాయకత్వంలో భారత స్వతంత్ర సమరాన్ని నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.భారత జాతీయ కాంగ్రెస్ దినోత్సవం సందర్భంగా నాయకులకు, కార్యకర్తలకు, కోట్లాదిమంది మద్దతుదారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, సుందరి వెంకటేశ్వర్లు, తోనం కృష్ణ, బాల్ రెడ్డి, బాబా, పత్తిపాక జనార్దన్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular