గిన్నిస్ రికార్డు సాధించిన నాట్యగురు తిరుపతి స్వామి బృందం
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 28( ప్రతినిధి మాతంగి సురేష్): శ్రీ తన్వి నటరాజ్ నృత్య పాఠశాల నిర్వాహకుడు నాట్యగురు తిరుపతి స్వామి తన పది మంది విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఈ రికార్డును సాధించారు. రికార్డులు సాధించిన విద్యార్థులు కుసుమ, హరిత, ఆధ్య, రక్షిత, అన్షి, మేఘన, తన్వి,దర్శిక, ద్యుతి, ఉద్విత
పిల్లలతో పాటు, తల్లిదండ్రులు తమ పిల్లలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం గొప్ప విషయమని ఇది కోదాడ పట్టణానికి ఎంతో గర్వకారణమని అన్నారు. పిల్లలకు నృత్యంలో ఇంత అద్భుతంగా శిక్షణ ఇచ్చినందుకు నాట్యగురువు తిరుపతి స్వామికి వారు తమ కృతజ్ఞతలు తెలిపారు.



