గ్రామంలో ప్రధాన సమస్యలే ఎజెండాగా పనిచేస్తా: గ్రామ సర్పంచ్ కంటు లాజర్
Mbmtelugunews//అనంతగిరి, డిసెంబర్29( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో ప్రధాన సమస్య అయిన మూడవ వార్డులో నీటి సమస్యను తీర్చేందుకు గ్రామపంచాయతీ నిధులతో బోరు వేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ కంటు లాజర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలులో గ్రామాన్ని అభివృద్ధి పథంలో పాలక మండలితో కలిసి ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గింజపల్లి జగ్గయ్య, మాజీ సర్పంచ్ గింజుపల్లి రఘు, ఉయ్యాల వీరయ్య, వార్డు మెంబర్ కంటు గోపి, శీలం నాగేంద్రబాబు, ఆర్ ఉపేందర్, కార్యదర్శి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు



