రాబోయే ఎన్నికలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం…..
:మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 29 (ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ఇటీవల జరిగిన స్తానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ గా గెలుపొందిన దొంతగాని అప్పారావు, వార్డు సభ్యులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికలలో గెలిచిన అందరికీ అభినందనలు తెలిపారు.కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంతగాని అప్పారావు, ఒకటో వార్డు మెంబర్ గుండెబోయిన ఏడుకొండలు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



