సహజసిద్ద పద్ధతులతో భూసారం పెరుగుతుంది……..
Mbmtelugunews//కోదాడ, జనవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్): సహజ సిద్ద పద్దతులతో భూసారంపెరుగుతుందని వ్యవసాయ సామాజిక కార్యకర్త, కిసాన్ సేవా రత్న డాక్టర్ మొలుగూరి గోపయ్య (గోపి ) తెలిపారు. మంగళవారం ఆయన స్వచ్చందంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయం పై రైతు చైతన్య యాత్రలో భాగంగా కోదాడ మండలం భీక్యతండా, రామలక్ష్మి పురం, ఎర్రవరం, గణపవరం, తొగర్రాయి, గుడిబండ గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వాతావరణం మార్పులు చోటు చేసుకోవడం తో వరిలో పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయన్నారు. వాటి నివారణకు రసాయన పురుగు మందులు వాడకుండా మనకు అందుబాటులో ఉన్న వేప ఆకులతో నీమస్త్రం, తూటికాడ, ఆవు మూత్రం, పేడ ద్రావణం, కాషాయలు వాడి సమర్థవంతంగా నివారించవచన్నారు. అలాగే నేల సారం పెరగాలంటే జీవామృతం వాడాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి తమ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అమరగాని లక్ష్మయ్య, కొండా దనమూర్తి, వట్టికూటి గురవయ్య, గూడెపు నాగేశ్వరావు, రాపోలు సాయన్న, కంపెసాటి సతీష్, అమరగాని పెద్దులు పాల్గొన్నారు.



