వైభవంగా సాగిన పాదయాత్ర
Mbmtelugunews//కోదాడ, జనవరి 10( ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ రామాలయం నుండి బండపాలెం శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయందాకా రామిశెట్టి కృష్ణవేణి ఆధ్వర్యంలో భక్తులు సాగించిన పాదయాత్ర కనుల విందుగాను,వైభవంగా ను జరిగింది,ఆనంద పారవశ్యం తో భక్తిపూర్వకంగా సాగిన ఈ పాదయాత్రలోదాదాపు 300మంది భక్తులు పాల్గొన్నారు.వేంకటేశ్వరస్వామికి, అమ్మవారికి విశేషపూజలు, విశేష భజనలు జరిగాయి.దైవదర్శనానంతరము పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలు భక్తుల నాకట్టుకున్నాయి. మజ్జిగ ప్యాకెట్లతో చాలా ఔత్సాహికంగా సాగింది.ఈ కార్యక్రమంలో,ఆలయచైర్మన్ ముడుంబై వేణుగోపాలాచార్యులు, మాజీచైర్మన్ ముడుంబై వరదరాజస్వామి, స్థానాచార్యులు ముడంబైలక్ష్మణాచార్యులు, అర్చకులు ముడుంబై శ్రీనివాసాచార్యులు, ముడుంబై జగన్, డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల జగన్నాథాచార్యులు, రన్ సీ రంగాచార్యులు, నూనె సులోచణ, మంగమని,
కనగాల రాధాకృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.



