చింతా నాగమణి మరణం ఆ కుటుంబానికి తీరనిలోటు
Mbmtelugunews//నడిగూడెం, జనవరి14: మండల పరిధిలోని చెన్నకేశవాపురం గ్రామానికి చెందిన చింతా నాగమణి అనారోగ్యంతో మృతి చెందినది. విషయాన్ని తెలుసుకున్న సర్పంచ్ గోసుల రాజేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చింతా నాగమణి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. ఇంట్లో పెద్ద దిక్కున కోల్పోతే ఆ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ కటికల పుల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ అనంతుల ఉపేందర్, శివరాత్రి వీరబాబు, పప్పుల ఉపేందర్, కలకొండ మనోజ్, దున్న భద్రయ్య, దున్న విజయ్, పచ్చిగోళ్ళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



