ముగిసిన ధనుర్మాసోత్సవాలు
Mbmtelugunews//కోదాడ, జనవరి 14(ప్రతినిధి మాతంగి సురేష్): గత నెల డిసెంబరు 16నుండి ఈనెల జనవరి14,బుధవారం ఈ రోజు
వరకునెలరోజుల పాటు మన కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులోగల రంగుని గుడిలో జరుగుచున్న తిరుప్పావై పూర్వక ఉత్సవాలు వైభవంగా ముగిశాయి.ఈ దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యములో శ్రీమాన్ ముడుంబై లక్ష్మణాచార్యులుచే తిరుప్పావై ప్రవచనాలు సాగిన సంగతి తెలిసిందే. ఈ ప్రవచనాలు బుధవారంతో ముగిశాయి.



