Saturday, January 24, 2026
[t4b-ticker]

కార్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై అఖిలపక్షాల సమావేశంకు బహుజన సమాజ్ పార్టీ మద్దతు

*కార్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై అఖిలపక్షాల సమావేశంకు బహుజన సమాజ్ పార్టీ మద్దతు*…

Mbmtelugunews// సూర్యాపేట, జనవరి 24(ప్రతినిధి మాతంగి సురేష్): బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ అన్న ఆదేశానుసారం సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాలలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగిందని BSP సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వమే కార్ల రాజేష్ లాకప్ డెత్ కు కారణం. లాకప్ డెత్ కు కారణమైన అధికారులను తప్పించడం కోసం  ప్రభుత్వం వ్యవహరించిన తీరు పోలీసు వ్యవస్థ మొదలుకొని పోస్టుమార్టం వరకు అధికారులను ఉపయోగించుకొని కేసును తప్పుదారి పట్టించారు. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన కులం పేరుతో పరువు హత్యలు అన్నగారిన వర్గాల జాతులపైనే అత్యాచారాలు, అవమానాలు ఇప్పటికీ జంతువులకన్నా హీనంగా చూస్తున్నారు. మా మాన ప్రాణాలు అంటే ఏ ప్రభుత్వాలకు లెక్కలేదు. కుక్కను చంపితే ప్రశ్నించే ఈ రోజుల్లో ఒక మనిషిని చంపిన పట్టించుకోవడంలేదంటే దానికి నీ కులమై కారణం. రిజర్వేషన్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఇట్టి విషయం పైన స్పందించకపోవడం దుర్మార్గమైన విషయం. అగ్రవర్ణాలపై ఎలాంటి దాడి జరిగిన క్షణంలో పరిష్కారం దొరుకుతుంది. వెంటనే చట్టాలు అమలు అవుతాయి చట్టాలు వస్తాయి. అగ్రవర్ణాలు సంబంధించి వ్యక్తులుగానే నాయకులు గాని మాకు అన్యాయం జరిగిందని రాస్తారోకోలు ధర్నాలు నిరసనలు చేసిన దాఖలాలు చాలా తక్కువ దీనికి అంతటి కారణం ఏంది వాళ్లు పాలకులు అవ్వడమే. మనం పాలకులుగా అయినప్పుడు మాత్రమే మన సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. భారత రాజ్యాంగం చట్టాలు అమలు కావాలంటే మన ఆడపడుచుల పైన అత్యాచారాలు మరియు కులం పేరుతో జరిగే హత్యలు ఆగాలన్న మనం పాలకులు కావడమే పరిష్కారం. కార్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఈ కేసు కు సంబంధించిన అధికారులు శిక్ష పడేంత వరకు మా రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఈ పోరాటంలో భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన వారు MRPS,BSP,BRS,BJP,CPM,MSP పార్టీ ప్రతినిధులు,విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular