Saturday, January 24, 2026
[t4b-ticker]

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం

:కూతురు లేని ఇల్లు -చంద్రుడు లేని ఆకాశం లాంటిదని

:ఆడపిల్లలను బ్రతకనిద్దాం:డాక్టర్ వీరేంద్రనాథ్

Mbmtelugunews//సూర్యాపేట, జనవరి 24(ప్రతినిధి మాతంగి సురేష్): సమాజంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను బతకనివ్వాలని వారికి విద్యాబుద్ధులు నేర్పించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని కందగట్ల ప్రభుత్వ వైద్యులు బంకా వీరేంద్రనాథ్ అన్నారు. ఆత్మకూర్ యస్ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ వీరేంద్రనాథ్ మాట్లాడుతూ. ఆడపిల్లలు – సమాజానికి మణిహారంలాంటిదని ⁠ కూతురు లేని ఇల్లు -చంద్రుడు లేని ఆకాశం లాంటిదని తల్లిదండ్రులకు కూతురంటే భారం కాదని అది దేవుడిచ్చిన వరం లాంటిదని సమాజంలో ఆడపిల్లలను పుట్టనిద్దాం – ఎదగనిద్దాం, చదివించి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తెలిపారు. అలాగే హాస్పిటల్ లో ⁠లింగ నిర్ధారణ పరీక్షలు -చట్టరీత్యా నిషేధం అని ప్రభుత్వం ఇప్పటికే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

భ్రూణ హత్యలు నివారిద్దాం- ఆడపిల్లలను రక్షిద్దాం
బాలికలను ఆదరించండి -చదివించండి ఆడ మగ – తేడా వద్దని పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని లింగ నిర్ధారణ చేసేవారి గురించి, అబార్షన్లు చేసేవారి గురించి 6300030940 నెంబర్ కి కంప్లైంట్ చేసి ఆడపిల్లలను బ్రతకనియండి అని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల అధ్యాపక బృందం, సిబ్బంది, ఏఎన్ఎం అరుణ, ఆశ వర్కర్లు విజయ, లలిత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular