Friday, February 6, 2026
[t4b-ticker]

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

:నాలుగొవ వార్డు అభ్యర్థి సుల్తాని సుజాత రాంబాబు ను ఆశీర్వదించండి.

:చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి.

:వార్డు ఇంచార్జ్ ఇంచార్జ్ బాణాల నాగరాజు

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 06(ప్రతినిధి మాతంగి సురేష్): మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవకుడిగా ‌కృషి చేస్తాడని ఆశీర్వదించి చెయ్యి (హస్తం) గుర్తుపై ఓటు వేసి అఖండ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని 4 వ వార్డు ఇంచార్జ్ బాణాల నాగరాజు అన్నారు. శనివారం నాలుగో వార్డులో ప్రచారంలో భాగంగా కౌన్సిలర్ అభ్యర్థి సుల్తాని సుజాత రాంబాబు గ్రామ అధ్యక్షులు షేక్ సోంద్ మియా, గ్రామ పెద్దలతో కలిసి నాగరాజు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వార్డులోని అనేక సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ అనేక సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వార్డు ప్రజలు చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వార్డుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. 4 వ వార్డ్ లో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు వార్డు పరిశుభ్రత, మంచినీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్ ,నూతన సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి వార్డు అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎండి నన్నేసాహెబ్, కోదాటి వెంకటేశ్వర్లు, కమ్మతం వెంకటయ్య, మాతంగి ప్రసాద్, బత్తినేని శ్రీనివాసరావు, తుమాట రామయ్య, ఏలూరు నాగయ్య, మాతంగి సురేష్, కోదాటి రామారావు, నిడిగొండ కనకయ్య, రంగారెడ్డి, కాసులు, మున్న, కోటేశ్వరరావు, వెంకన్న, పెద రోశయ్య, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular