సిద్ధార్థ రెడ్డి – రూపశ్రీ లను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 23(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన ఇర్లా శ్రీనివాసరెడ్డి – హేమంత కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడింది.
ఈ శుభకార్యానికి స్థానిక ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి, గణపవరం గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య లు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే, సర్పంచ్ ఆశీర్వాదాలతో ఈ వేడుకకు ప్రత్యేక గౌరవం, మరింత శోభ చేకూరింది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులుగా వారు మరోసారి తమ సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు.

నూతన దంపతులకు ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండిన సుఖసంతోషకరమైన దాంపత్య జీవితం కలగాలని మనస్పూర్తిగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సింగారెడ్డి సుమన్ రెడ్డి, సానికొమ్ము తరుణ్ రెడ్డి,శ్రీను, చినకోటయ్య, సూర్యనారాయణ, వరాల్ రెడ్డి, గురవయ్య, మట్టయ్య, నాగస్వరూప్, కాసాని సత్యం, చెన్నారెడ్డి, కృష్ణయ్య, రామి రెడ్డి, రాంబాబు, ధనమూర్తి, కరుణాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, గురు స్వామి,ఆదిరెడ్డి, కాశయ్య, మీరా తదితరులు పాల్గొన్నారు.



