Tuesday, March 24, 2026
[t4b-ticker]

కెఆర్ఆర్ కళాశాలలో జాబ్ మేళా

కెఆర్ఆర్ కళాశాలలో జాబ్ మేళా

Mbmtelugunews//కోదాడ, మార్చి 24(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక కెఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల లో 24/03/2026 మంగళవారం ఉదయం 10 గంటలకు”లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఉద్యోగం మేళాకార్యక్రమం నిర్వహించారు. ప్లేస్ మెట్ ఆఫీసర్ జి సైదులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. కంపెనీల హెచ్ఆర్ మేనేజర్ మనోజ్ డిగ్రీ పూర్తిచేసిన నిరుద్యోగుల నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు యాభై మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. వీరిలో పదిమంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాన్ని పొందారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి హడాస రాణి మాట్లాడుతూ కష్టపడి చదువుకుంటే విద్యార్థులకు అవకాశాలు వస్తాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా, చందా అప్పారావు మాట్లాడుతూ జాబ్ మేళా అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అధ్యపకేతర సిబ్బంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular