బగ్గుమన్న పాత కక్షలు… కర్రలతో ఇరువర్గాల దాడి
Mbmtelugunews//కోదాడ, మార్చి 30: మండల పరిధిలోని అడ్లూరు పునరావాస కేంద్రంలో జరిగిన గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి గత గ్రామసభలో చర్చించుకున్న విషయాల పురోగతిపై సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచ్ గువ్వల శిరీష అధ్యక్షుతన జరిగిన సమావేశంలో గ్రామంలోని పలు అంశాలపై చర్చిస్తుండగా వాగ్వాదం చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఉపసర్పంచ్ తన అనుమతి లేకుండా నిధులు ఎలా విత్ డ్రా చేస్తారని ఆరోపించారు. సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ అంశం, గ్రామంలోని దేవాలయ నిర్మాణం, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన అంశాలపై ఇరు వర్గాలకు తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను అదుపు చేసి చదరగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.



