Sunday, April 12, 2026
[t4b-ticker]

ఇంటర్ ఫలితాల్లో రేస్ కళాశాల విద్యార్థుల ప్రతిభ…

ఇంటర్ ఫలితాల్లో రేస్ కళాశాల విద్యార్థుల ప్రతిభ…

:విద్యార్థుల విజయం గర్వకారణం…

:రేస్ చైర్మన్ బాణాల వసంత రెడ్డి అభినందనలు

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 12(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కోదాడ రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కళాశాలకు చెందిన రెడ్డి శ్రీ తేజన్య ఎంపీసీ విభాగంలో 470కి 468 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకు పొందగా, సిహెచ్ యామిని 467 మార్కులతో ద్వితీయ ర్యాంకు సాధించారు.
అలాగే ఎన్ మౌనిక, జి భవ్య శ్రీ, ఆర్ శ్రీనిజా రెడ్డి, జైనబ్‌లు 466 మార్కులు సాధించి ప్రతిభ చాటారు.ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బాణాల వసంత రెడ్డి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల, కఠోర శ్రమ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యార్థుల విజయానికి తోడ్పడిన అధ్యాపకులను, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular