ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ చైతన్య విజయభేరి
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 29 (ప్రతినిధి మాతంగి సురేష్): 2025-26 ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు వంగవీటి పూజిత లక్ష్మి 595, అప్పన జశ్విత 594 మార్కులతో కోదాడ టౌన్ ప్రధమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. వీరితోపాటు 580 పైగా మార్కులు 27 మంది విద్యార్థులు సాధించడం అదేవిధంగా 100% ఫలితాలతో ఉత్తీర్ణత సాధించడం అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను ఈజీఎం మురళీకృష్ణ అభినందించారు.
*పూజిత లక్ష్మి ప్రభంజనం*

కోదాడ శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన వంగవీటి పూజిత లక్ష్మి పదవ తరగతి ఫలితాలలో 595 మార్కులు సాధించింది పూజిత తండ్రి వి రామనరసింహారావు తల్లి స్వప్న ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నా విజయానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం పాఠశాల ప్రతిష్ట ప్రణాళికలతో ఉపాధ్యాయుల ప్రోత్సాహం నా విజయాన్ని కారణమని అన్నారు. మా పాఠశాల వారు అందించిన రివిజన్ ప్రోగ్రాం, స్టడీ మెటీరియల్ నా విజయానికి ఎంతో దోహదపడ్డాయని తెలిపారు.
*ఏ జశ్విత విజయభేరి*

శ్రీ చైతన్య పాఠశాల కోదాడకు చెందిన ఏ జశ్విత 594 మార్కులతో విజయవరీ మోగించింది తండ్రి శ్రీనివాస రావు వడ్ల వ్యాపారి తల్లి బిజినెస్ చేస్తూ కష్టపడి చదివించినారన్నారు. పట్టుదల కృషి నిరంతరం ప్రణాళికతో విజయాన్ని సాధించవచ్చు అని జశ్విత తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్స్ గోపాలస్వామి, వీరారెడ్డి, ప్రవీణ్, డీన్స్, ఇన్చార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



