ఎస్ఎస్సి ఫలితాలలో ఎస్ఆర్ఎం సంకల్ప విజయభేరి
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 29(లోకం తీరు): నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో కోదాడకు చెందిన ఎస్ఆర్ఎం సంకల్ప విజయ బేరి మోగించింది. కొలిపాక గ్రీష్మ 585, వేనేపల్లి మనస్వి 588, వల్లపుదాసు లక్ష్మీదీక్షిత 588 మార్కులతో విజయభేరీ మోగించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం అధ్యాపక బృందం వీరిని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు ఇంత మంచి ర్యాంకులు తీసుకువచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజులలో ఇంకా మంచి మార్కులు సాధించి చదువుకున్న పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు.



