శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణకు చిరు సత్కారం
:పేద ప్రజల ప్రక్షాన నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి బాలకృష్ణ
: రావెళ్ల సీతరామయ్య, బొల్లు రాంబాబు
Mbmtelugunews//కోదాడ, మే 07(ప్రతినిధి మాతంగి సురేష్): అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (ఆస్క్), కోదాడ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్, టీజీ ఆర్జెసి కోచింగ్ సెంటర్ లో
శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణ కి ఘన సన్మాన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెస్ కళాశాలలో గురువారం ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య, విశ్రాంత ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు లు పాల్గొని సన్మాన గ్రహీతను సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా రావెల సీతారామయ్య మాట్లాడుతూ సత్యమేవ జయతే సేవాసమితి ద్వారా సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతూ, విద్యుత్ శాఖలో రైతులకు, పేద ప్రజల పక్షాన నిరంతరం శ్రమ చేస్తున్న నాదెళ్ల బాలకృష్ణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత శ్రమశక్తి అవార్డు పొందడం ఎంతో ఆనందించదగిన విషయమని అన్నారు. విద్యార్థినీ విద్యార్థులు బాలకృష్ణని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాతంగి ప్రభాకర్ రావు, బొడ్డు హుస్సేన్, అమరబోయిన వెంకటరత్నం, గంధం బుచ్చారావు, కనుకు శ్రీకాంత్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..



