Monday, May 18, 2026
[t4b-ticker]

ఎంసెట్ లో మెరిసిన రేస్ విద్యార్థులు.

ఎంసెట్ లోమెరిసిన రేస్ విద్యార్థులు.

అద్భుత ఫలితాలతో రేస్ కాలేజీకి రాష్ట్రస్థాయి గుర్తింపు.

రికార్డు స్థాయిలో క్వాలిఫై అయిన రేస్ విద్యార్థులు.

Mbmtelugunews//కోదాడ, మే 17( ప్రతినిధి మాతంగి సురేష్ ):ఎంసెట్ ఫలితాలలో రేస్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి స్టేట్ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన మొక్కా చరణ్ సాయి 380, ఐ. కృష్ణ చరణ్ 440, సిహెచ్ భాను శంకర్ 1775, డి విజయ్ చరణ్ 2135, సిహెచ్ ఉత్తేజ్ 5231, లేఖనా రెడ్డి 6749, కురువ నవీన్ 7354, వంగవీటి అక్షయ8462,వెంకటదత్త కిరణ్ 9748 ర్యాంకులు సాధించారు.ఈ సందర్భంగా చైర్మన్ బాణాల వసంత రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ ఏడాది పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, కాలేజీ నుంచి రికార్డు స్థాయిలో విద్యార్థులు క్వాలిఫై అయ్యారని తెలిపారు.అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular