స్వేరో ఐడియాలజీ తోనే అణగారిన వర్గాల అభివృద్ధి: చెరుకుపల్లి కిరణ్
Mbmtelugunews//కోదాడ, జూన్ 03(ప్రతినిధి మాతంగి సురేష్):స్వేరోస్ నెట్వర్క్ ను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించాలనే స్వేరోస్ కేంద్ర నాయకులు బల్గూరి దుర్గయ్య ఆదేశానుసారం బుధవారం కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామంలో పాముల రాకేష్ ఆధ్వర్యంలో లో స్వేరోస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్ పాల్గొని మాట్లాడుతూ పేద వర్గాలు వెనుకబాటుకు గురవడానికి కారణం విద్య లేకపోవడమేనని విద్య ద్వారానే ఆర్థిక సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుందని అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలోచన లో నుండి వచ్చిన అక్షరం ఆర్థికం ఆరోగ్యం అనే నినాదంతో స్వేరోస్ నెట్వర్క్ పనిచేస్తుందని, అదే స్వేరో ఐడియాలజీ అని ఆ ఐడియాలజీతో అణగారిన వర్గాలు అభివృద్ధి సాధించవచ్చు అని చెప్పారు.యువత చెడు మార్గాల వైపు కాకుండా విద్యను ఆలంబనగా చేసుకొని ఆర్థిక అభివృద్ధికి ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.నూతనంగా ఎన్నికైన స్వేరోస్ గ్రామ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెడపంగు నాగార్జున, నూతన కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.



