స్టేషనరీ షాప్స్ లా మారిన కోదాడ ప్రైవేట్ పాఠశాలలు
:కేశబోయిన మురళీకృష్ణ ( తెలంగాణ స్టూడెంట్ యూనియన్)
Mbmtelugunews//కోదాడ, జూన్ 24:పట్టణంలో గల వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలను విక్రయిస్తూ, అధిక ఫీజులు వసూలు చేస్తూ మార్కెట్లో కేవలం 2000 విలువ చేసే పుస్తకాలను 15 వేల నుండి 20వేల వరకు వసూలు చేస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు తీవ్రంగా మోయలేని భారాన్ని వారిపై వేస్తున్నారు తక్షణమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టూడెంట్ యూనియన్, ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు కోదాడ మండల విద్యాశాఖ అధికారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం తెలంగాణ స్టూడెంట్ యూనియన్ నాయకులు కేశబోయిన మురళీకృష్ణ మాట్లాడుతూ కటకమ్మగూడెం రోడ్ లో గల అక్షర స్కూల్ లో ఎలాంటి పర్మిషన్ లేకుండా బుక్స్ అధిక రేట్లకు అమ్ముతున్నారని స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘాలమైన మేము వెళ్లి స్కూల్ వారిని అడగగా వారు దురుసుగా ప్రవర్తించి మా మీదకు విచక్షణ రహితంగా వచ్చినారని వారు అన్నారు. అనంతరం ఎంఈఓ సలీం షరీఫ్ కి సమాచారం అందించగా తక్షణమే అక్షర స్కూల్ కు చేరుకుని స్కూల్లో తాళాలు వేసిన గదులను ఓపెన్ చేయగా లక్షల రూపాయల విలువైన నోటు బుక్స్, బుక్స్ రూమ్ లో భద్రపరిచి ఉండటాన్ని చూసి ఆ రూములను సీజ్ చేయటం జరిగినది. గతంలో బార్ అండ్ రెస్టారెంట్ నడిపిన బిల్డింగులకు స్కూల్ పర్మిషన్ ఎలా ఇచ్చారని విద్యార్థి సంఘాలు వాపోయారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా బుక్స్ అమ్ముతున్న ప్రైవేటు స్కూల్స్ పై చర్యలు తప్పవని ఎంఈఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేశబోయిన మురళీకృష్ణ , తెలంగాణ స్టూడెంట్ యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మేకల వీరబాబు, ఎంఎస్ ఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పందిటి నవీన్ కుమార్ మాదిగ, గంటేపంగు నమ్రుత్, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు పుట్టపాక ఉదయ్ భాస్కర్, రేపాకుల సందీప్, మీర్జా షకీల్, బెల్లంకొండ హరి గౌడ్, సిద్దు యాదవ్, ఐశ్వర్ తేజ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు….



