Wednesday, July 29, 2026
[t4b-ticker]

స్వేరోస్ కూచిపూడి గ్రామ కమిటీ ఎన్నిక

స్వేరోస్ కూచిపూడి గ్రామ కమిటీ ఎన్నిక

Mbmtelugunews//కోదాడ, జులై 28( ప్రతినిధి మాతంగి సురేష్): స్వేరోస్ నెట్వర్క్ నో గ్రామ గ్రామాన విస్తరించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని కూచిపూడి గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్ పాల్గొని మాట్లాడుతూ అణగారిన వర్గాలు అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే నినాదాన్ని ఆసరాగా చేసుకుని సంఘటితం కావాలని అలా అయినప్పుడే బలవంతులం అవుతామని, అణగారిన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ నెట్వర్క్ ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులను అభినందించారు. స్వేరోస్ సూర్యపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చెడపంగు నాగార్జున గ్రామ కమిటీ అధ్యక్షులుగా దుద్దెల నాగేంద్రబాబు, ప్రధాన కార్యదర్శిగా మంద కిరణ్ ఎన్నికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్, అనిల్, విష్ణు సైదులు, ప్రశాంత్, రాము, వీరబాబు బన్ను, కార్తీక్, సుందర్రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular