Friday, August 7, 2026
[t4b-ticker]

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సర్పంచి మందుల నాగయ్య

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సర్పంచి మందుల నాగయ్య

Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 06(ప్రతినిధి మాతంగి సురేష్): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో సర్పంచి మందుల నాగయ్య గ ఆధ్వర్యంలో దోమలను,సీజనల్ వ్యాధులను నివారించడానికి మురికి కాలువల పూడికతీత పనులు చేపట్టడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, వర్షపు నీటి నిల్వలను నివారించడం, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఈ పనులు కొనసాగుతున్నామన్నారు. గ్రామాభివృద్ధి కోసం అవసరమైన పారిశుద్ధ్య చర్యలను గ్రామ పంచాయతీ నిరంతరం చేపడుతోందని అన్నారు. ప్రజలు ఈ కాలంలో ఇంట్లో వచ్చిన చెత్తను వీధులలో పక్క ప్లాట్ లలో పడేయకుండా గ్రామపంచాయతీ వాహనానికి అందించాలని ఈ సందర్భంగా తెలిపారు. వర్షాలు పడుతున్న వేళ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ డాక్టర్లు ఇస్తున్న సలహాలను పాటిస్తూ సీజనల్ వ్యాధులను తరిమికొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular