పిజి ఎంట్రన్స్ లో ప్రతిభ చాటిన విద్యార్థిని
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 06(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని ఎర్రవరం గ్రామానికి చెందిన బూర బాల భవిత శ్రీ పీజీ ఎంట్రన్స్ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డయాటిక్స్ విభాగంలో రాష్ట్ర 22వ ర్యాంకు సాధించారు. ఇటీవల ఏపీ పీజీ ఫలితాలలో కూడా ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో ర్యాంక్ సాధించారు. భవిత శ్రీ ఇటీవలే హైదరాబాదులోనే కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పేద కుటుంబానికి చెందిన విద్యార్థినీ స్టేట్ ర్యాంక్ సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు, హర్షం వ్యక్తం చేశారు.



