కోదాడలో కొలువుల జాతరను ప్రతి ఒక్క నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి.
:ఇలాంటి జాబు మేళాలు యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా ఉపయోగపడతాయి.
:సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ నెల 19న కోదాడ పట్టణంలో ని సిసి రెడ్డి కాన్వెంట్ లో మెగా జాబ్‌మేళా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్నట్లు గుడిబండ సర్పంచి, మండల సర్పంచుల ఫోరం కోశాధికారి మందుల నాగయ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల లోని ఎంతోమంది యువత డిగ్రీలు, ఐటిఐ బీటెక్లు చేసి ఖాళీగా ఉంటున్నారనే సదుద్దేశంతో మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు యువత పెడదారి పట్టకుండా వారిని ఉద్యోగ కల్పన వైపు మళ్ళించాలనే సదుద్దేశంతో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో సుమారు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలను హాజరవుతున్నాయని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ విద్యార్హతలు కలిగిన వారితో పాటు అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కంపెనీల ప్రతినిధులతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా జాబ్‌మేళాకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఒక వరం లాంటిది ప్రతి ఒక్కరూ ఈ జాబు మేళాకు హాజరై ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల కలను సహకారం చేయాలని అన్నారు. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల పిల్లలే మా పిల్లలు అని తరచూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిలు అంటుంటారు దానికి నిదర్శనం ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధితోపాటు నియోజకవర్గంలో నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ రెండు నియోజకవర్గాలపై వారి ప్రేమ ఏంటో అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని అన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే తల్లితండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహిస్తూ ఈ జాబు మేళాకు పంపించాలని మందుల నాగయ్య కోరారు.



