19 కోదాడలో మెగా జాబు మేళ
:నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం
:నిరుద్యోగులు లేని నియోజకవర్గాలే మంత్రి ఎమ్మెల్యే లక్ష్యం.
:నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ పట్టణములో సీసీ రెడ్డి విద్యా నిలయంలో సెప్టెంబర్ 19వ తారీఖు న నిర్వహించే మెగా జాబు మేళను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలిని కోదాడ మున్సిపల్ 19 వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మెగా జాబు మేళాకు 200 నుండి 250 కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆశావహులు ఆన్లైన్ నందు రిజిస్టర్ చేసుకుని 19 వ తారీఖు నాడు ఇంటర్వ్యూలకు వారి యొక్క విద్యార్హత పత్రాలను తీసుకొని ఇంటర్వ్యూలో ప్రతిభను కనపరిచి ఉద్యోగం సంపాదించుకోవాలని కోరారు. కోదాడ, హుజూర్ నగర్ యువతీ యువకులు ఉద్యోగం కోసం కంపెనీల చుట్టూ తిరిగే పరిస్థితి నుండి కంపెనీలనే నిరుద్యోగుల వరకు తీసుకొస్తున్నటువంటి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి అభినందనీయమని తెలిపారు. నిరుద్యోగ యువత ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం సంపాదించాలంటే ఎంతో కఠోరమైన శ్రమ డబ్బులు ఖర్చుతో కూడుకున్నది అలాంటివి ఏమీ లేకుండా మంత్రి, ఎమ్మెల్యే సహకారంతో కోదాడలోనే జాబు మేళ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ ప్రాంత ప్రజల పాలిట మంత్రి, ఎమ్మెల్యే ఆపద్బాంధవులు గా చరిత్రలో నిలిచిపోతారని స్కిల్ ఉండి ఎలా ఉద్యోగం సంపాదించాలో అర్థం కాని యువకులకు వారి చెంతకి కంపెనీలు రావడం చరిత్రలో అద్భుతమైనదని గత సంవత్సరం హుజూర్ నగర్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయని 19వ తారీఖు నాడు కోదాడ లో నిర్వహించబోయే మెగా జాబ్ మేళా నందు కూడా కొన్ని వేల మందికి అవకాశాలు దొరుకుతాయని ఈ ప్రాంత ప్రజల విద్యార్థుల తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడ్డానికి కంకణబద్దులై ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా ఏర్పాట్లు చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఉత్తమ్ పద్మావతి లకు 19వ వార్డు కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, మాజీ వార్డ్ కౌన్సిలర్ కొల్లా లక్ష్మీ ప్రసన్న కోటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.



