Tuesday, September 15, 2026
[t4b-ticker]

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ నాయక్ కలిసిన చిలుకూరు మండల

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ నాయక్ కలిసిన చిలుకూరు మండల బీజేపీ అధ్యక్షులు పారెల్లి మహేష్

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 14(మనం న్యూస్): గిరిజన సమస్యలపై ప్రత్యేక చొరవక్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ స్థాయి రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో రాజకీయ పార్టీల స్థానిక నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే, తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన బిజెపి రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగి రాజు నేతృత్వంలో చిలుకూరు మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్, చందా విజయ్, భూక్య రవి నాయక్ ,కోదాడ గ్రామీణ మండల అధ్యక్షులు గాదరి పుల్లారావు ఆధ్వర్యంలోని నాయకత్వం.. న్యూఢిల్లీలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్సిఎస్టి) గౌరవ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ నీ ప్రత్యేకంగా కలుసుకున్నారు.చిలుకూరు మండలంలోని అనేక గిరిజన తండాలు ఇప్పటికీ కొన్ని ప్రాథమిక మరియు భూసంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయి. పోడు భూముల పట్టాల పంపిణీలో జరుగుతున్న ఆలస్యం, గిరిజన సంక్షేమ పథకాలు అర్హులకు చేరకపోవడం, మరియు స్థానిక గిరిజనుల హక్కుల ఉల్లంఘన వంటి అంశాలను జాతీయ స్థాయికి చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మండల బీజేపీ పార్టీ ఈ సమస్యలన్నీటిపై సమగ్రంగా వినతి పత్రం అందజేసిందిరాజకీయాలకతీతంగా గిరిజన సోదరుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం చిలుకూరు మండల బీజేపీ అధ్యక్షులు పారెల్లి మహేష్ కలిసి వారికి వినతిపత్రం అందజేశారు. వారి బృందం చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాతోత్ హుస్సేన్ నాయక్ సానుకూలంగా స్పందించి వారి చొరవతో చిలుకూరు మండలంలోని తండాల ప్రజల దీర్ఘకాలిక సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular