యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు.
:200 నుండి250 కంపెనీల ద్వారా కొలువుల జాతర.
:19న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగయువతసద్వినియోగంచెసుకోవాలి: పులి వెంకటేశ్వర్లు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ నెల 19న కోదాడ పట్టణంలో సిసి రెడ్డి విద్యా నిలయం ఆవరణలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు విశ్రాంతి ఎస్సై గుడిబండ కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి సహకారంతో భారీ స్థాయిలో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు 200 నుంచి 250 ప్రముఖ కంపెనీలను జాబు మేళ లో పాల్గొంటున్నయని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ విద్యార్హతలు కలిగిన వారితో పాటు అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కంపెనీల ప్రతినిధులతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాబ్‌మేళాకు హాజరై తమ ప్రతిభను నిరూపించుకోని ఉద్యోగం సంపాదించి భవితకు బాటలు వేసుకోవాలని కోరారు . కోదాడ పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా వివరాలను విస్తృతంగా చేరవేసి, అధిక సంఖ్యలో యువత పాల్గొనేలా చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో అందుతున్న ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించి తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదివేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రోడ్డులకు కృతజ్ఞతలు తెలిపారు.



