అల్వాలపురం సర్పంచిగా పోతురాజు సత్యనారాయణ…….
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని అల్వాలపురం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి పోతురాజు సత్యనారాయణ బిఆర్ఎస్ ప్రత్యర్థి మీసాల శోభారాణి పై 246 ఓట్లతో విజయం సాధించారు.అల్వాలపురం గ్రామపంచాయతీ లో మొత్తం 8 వార్డులు ఉండగా 4 వార్డుల్లో సిపిఐ 4 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మద్దెల మరియమ్మ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున బాణాసంచ మంగళ వాయిద్యాలతో పెద్ద ఎత్తున గ్రామంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోతురాజు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర నీటిపారుగల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి పాలకవర్గంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. పాలకవర్గంలో గ్రామంలో ఉన్న సమస్యలను చర్చించి త్వరలో పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ మండల కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి పోతురాజు రాజేశ్వరరావు, మాతంగి ప్రసాద్, మాతంగి గాంధీ, కొండ కోటేశ్వరరావు, నాగుల్ మీరా, బద్రిశెట్టి వెంకటనారాయణ, మద్దెల వెంకటి, బండారు వెంకటేశ్వర్లు, కంబాల రంగ, కంబాల సైదులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
.



