Friday, September 25, 2026
[t4b-ticker]

వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

వార్డు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

:19 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తా ఆశీర్వదించండి.

: చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన.

: 19 వ వార్డు కౌన్సిలర్ కొల్లా ప్రసన్నలక్ష్మి కోటిరెడ్డి

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 04(ప్రతినిధి మాతంగి సురేష్): మున్సిపల్ పరిధిలోని 19 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవకుడిగా ‌కృషి చేస్తానని ఆశీర్వదించి చెయ్యి గుర్తుపై ఓటు వేసి అఖండ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ 19 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొల్లా ప్రసన్న లక్ష్మి కోటిరెడ్డి అన్నారు. గురువారం వార్డులో గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ కోదాడ మున్సిపల్ పరిధిలోనే 35 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని అన్నారు.

19వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రి ఉత్తమ్ కు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి కానుకగా ఇవ్వాలని అన్నారు. మంత్రి ఎమ్మెల్యే సహకారంతో వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని గుర్తు చేశారు. మున్సిపల్ అధికారుల పూర్తి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వార్డుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. 19వ వార్డ్ లో ఉన్న అనేక మౌలిక సదుపాయాలను వార్డు పరిశుభ్రత, మంచినీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్, నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి వార్డు అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ముడియాల భారత్ రెడ్డి, పొనగళ్ల వీరారెడ్డి, డి సీ వెంకటేశ్వర్ రెడ్డి, డేగ శ్రీధర్, మందరపు శేషు, పోటు రంగారావు, నలజాల శ్రీనివాసరావు, ముండ్ర రామారావు, కొల్లు క్షత్రియ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టి వీరబాబు, మా రెడ్డి వెంకటరెడ్డి, చిన్నమ్మ రెడ్డి, నీలిమ, సుశీల, మహమ్మద్ మౌలానా, వేనేపల్లి యాదగిరి, హాజీ నాయక్ ,కుటుంబ రెడ్డి, తిగుళ్ల నాగేశ్వరరావు, కొల్లా తాతిరెడ్డి, కలగట్ల బ్రహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular