Wednesday, December 24, 2025
[t4b-ticker]

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా…….

ఆర్యవైశ్య జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గరినే ఉమా…….

Mbmtelugunews//కోదాడ,మార్చి 09(ప్రతినిధి మాతంగి సురేష్):తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా పట్టణానికి చెందిన గరినే ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా నియమితులైనట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజకీయంగా,ఆర్యవైశ్య సామాజికపరంగా నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న వైశ్యరత్న గరినే కోటేశ్వరరావు కోడలైన ఉమామహేశ్వరికి జిల్లా స్థాయి అవకాశం రావడం పట్ల పట్టణానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.తనపై నమ్మకం ఉంచి తనకు అప్పగించిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని,మహాసభ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తూ జిల్లాలోని ఆర్యవైశ్య మహిళల ఐక్యతకు కృషి చేస్తానని ఉమామహేశ్వరి తెలిపారు.ఆర్యవైశ్య మహిళలను రాజకీయంగా చైతన్య పరిచేందుకు తన వంతు కృషిచేసి సంఘ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.ఆమె ఎన్నికపై జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి రమేష్,గారినే శ్రీధర్,వంగవీటి శ్రీనివాసరావు,పబ్బిశెట్టి సతీష్,దివ్వెల రామారావు,మూడు గుంట్ల శ్రీనివాసరావు,తవిడిషెట్టి నాగేశ్వరరావు,ఓరుగంటి పాండు,యాద సుధాకర్,వైశ్య యువజన సంఘ నాయకులు యిమ్మడి అనంత చక్రవర్తి,డాక్టర్ వంగవీటి భరత్ చంద్ర,ఓరుగంటి నిఖిల్,బెలిదే భరత్,వంగవీటి శరత్చంద్ర,అవోప కార్యవర్గం,వాసవి క్లబ్స్ బాధ్యులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular