ఆస్క్ పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ సెంటర్ లో మెటీరియల్ పంపిణీ
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం(ఆస్క్ )ఆధ్వర్యంలో ఎమ్మెస్ కళాశాలలో నిర్వహించబడుతున్న ఉచిత పాలిటెక్నిక్, టిజి ఆర్జెసి కోచింగ్ సెంటర్ లో స్టడీ మెటీరియల్ పంపిణీ పంపిణీ కార్యక్రమాన్ని ఆస్క్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య, సివిల్ కానిస్టేబుల్
కుర్రి నాగరాజు పాల్గొని విద్యార్థులకు వారి చేతుల మీదుగా అంద చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ డా, బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా పే బ్యాక్ టు సొసైటీ లో భాగంగా ఈ కోచింగ్ సెంటర్ ని అందరి సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మంచి అనుభవం విద్యార్హతలు ఉన్న ఉపాధ్యాయులచే బోధన చేస్తున్నామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు, కోర్స్ డైరెక్టర్
యలమర్తి శౌరి, బొడ్డు హుస్సేన్, చేకూరి రమేష్,
మేళ్లచెరువు వీరభద్రం,
కోర్స్ కో-ఆర్డినేటర్
గంధం బుచ్చారావు, మాతంగి సురేష్,కనుకు శ్రీకాంత్, అన్నేపాక. మహేష్, ఎం భవ్యశ్రీ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



