ఎంఆర్పిఎస్ మద్దతుతో గెలిచిన అభ్యర్థులకు సన్మానం
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో తెలంగాణ ఎంఆర్పిఎస్ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం జరిగింది.
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని గ్రామ ప్రజలు అర్హులైన అభ్యర్థులను గెలిపించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ జిల్లాల అధ్యక్షులు చింత బాబు మాదిగ పాల్గొని మాట్లాడుతూ గెలిసిన సర్పంచి అభ్యర్థులు గడవనున్న ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన పరిపాలన సేవలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాణాల అబ్రహం, ఎంఆర్పిఎస్ యువసేన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పోలంపల్లి శ్రీనివాస్, కోదాడ మండల అధ్యక్షులు నారగట్ల ప్రసాద్, ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు



