ఐకెపిలలో కానరాని కొనుగోళ్లు
:మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
:కనిపించని సంబంధిత అధికారులు,కాంటాలు
:ఇకనైనా కొనుగోల కేంద్రాలు ప్రారంభించక పోతే ఆందోళనలు ఉదృతం చేస్తాం
:అఖిలపక్ష నాయకులు,రైతు సంఘాల నాయకులు
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):ఆరు కాలం కష్టపడి పంట పండించిన రైతు తన పండిన పంటను అమ్ముకోవడానికి కంటతడి పెడుతున్నాడనని.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో గల తమ్మర బండపాలెం వద్ద కోదాడ టు ఖమ్మం జాతీయ రహదారిపై అఖిలపక్ష సంఘాల నాయకులు రైతు సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం సంబంధిత అధికారులు మొక్కుబడిగా టెంటు వేసి రిబ్బన్ కట్ చేసి వెళ్ళినారు తప్ప ఇంతవరకు కాంటాలు ఏర్పాటు చేయడంలో రైతులకు బస్తాలు ఇవ్వడంలో మొండి వైఖరి వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి పార్టీ అధికారంలోకి రాకముందు రైతే రాజు,రైతు లేనిదే రాజ్యం లేదు,రైతే దేవుడు,రైతే వెన్నెముకని ప్రకాల్పుగాలు పలికిన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక రైతు పండించిన పంటను కొనడంలో మాత్రం చవితి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతు నారుమడి వేసిన నాటినుండి పొలం కోతకు వచ్చేవరకు ఎంత పెట్టుబడి అయిన వెనకాడకుండా నవ్వుతూ పెట్టుబడి పెట్టి పంటను పండిస్తాడు చివరికి పండిన పంటను అమ్ముకునే సమయంలో రైతుకు కన్నీరే మిగులుతున్నది తప్ప రైతుల కళ్ళల్లో ఆనందం కనిపించట్లేదు అని వాపోతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు బస్తాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు.అనంతరం అనంతగిరి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి మీ సమస్య పరిష్కరిస్తాన హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాదు,బిజెపి అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ,మల్లెబోయిన వెంకటేష్ బాబు,సామినేని సుబ్బారావు,సామినేని నాగేశ్వరరావు,కనగాల కోటి,అలవాల గురవయ్య,కనకాల శేషగిరి,వంగూరి ఏసుపాదం,బొమ్మకంటి లక్ష్మీనర్స్ రైతులు తదితరులు పాల్గొన్నారు.