ఐకెపి ద్వారా కొన్న దాన్యం గవర్నమెంట్ కు వెళ్లిందా సొసైటీ వారు ఏమైనా అమ్ముకున్నారా?
:తమ్మర సొసైటీలో అవకతవకలు
:నెల రోజులు దాటిన రైతుల వడ్లకు డబ్బులు పడని పరిస్థితి
: గోడౌన్ కట్టిన సమయంలో అవకతవకలు పట్టించుకోని అధికారులు
:రైతుల గోడౌన్ లో బడా వ్యాపారుల పెత్తనం
:పిఎసిఎస్ లో కొట్టిన టేకు మొక్కల డబ్బులలో అవకతవకలు
:ఇంతవరకు రైతుల ఖాతాలలో పడని బోనస్ డబ్బులు
:పిఎసిఎస్ కు తాళం వేసిన రైతులు
Mbmtelugunews//కోదాడ,జనవరి 13(ప్రతినిధి మాతంగి సురేష్):రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి కేంద్రాల ద్వారా రైతుల నుండి నేరుగా కొన్న ధాన్యం కు సంబంధించి రైతుల ఎకౌంట్ లలో నెలలు గడుస్తున్న డబ్బులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర పిఎసిఎస్ సొసైటీ పరిధిలో చోటుచేసుకుంది.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం తమ్మర సొసైటీ పరిధిలో రైతుల నుండి కొన్న ధాన్యానికి సంబంధించి డబ్బులు పడకపోవడంతో పిఎసిఎస్ సిబ్బంది ఆ ధాన్యాన్ని ప్రభుత్వ గోడలకు తరలించారు లేకపోతే వీరే ఏమైనా అమ్ముకున్నారా అనే అనుమానాలతో సోమవారం తమ్మర పిఎసిఎస్ కు తాళం వేసి ఆందోళన వ్యక్తం చేసిన రైతులు.ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తమ్మర పిఎసిఎస్ లో ఎన్నో అవకతవకలు జరిగాయని రైతులకు కట్టిన గోడౌన్ నీ బడా వ్యాపారులకు లీజుకు ఇచ్చి డబ్బులు ఎక్కువ మొత్తంలో దండుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.
గోడౌన్ కట్టే సమయంలో అడ్డం వచ్చిన టేకు చెట్లను వేలం పాట పెట్టి దాని ద్వారా వచ్చిన డబ్బులకు లెక్కలు చూపించకుండా దానిలో కూడా అవక తవకలు జరిగాయని రైతులు వాపోతున్నారు.నెలలు గడుస్తున్న రైతుల ఎకౌంట్ లలో బోనస్ డబ్బులు పడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రైతుల ధాన్యం ప్రభుత్వానికి చేరిందా లేక పిఎసిఎస్ అధికారులు పక్కదారి పట్టించారా తేల్చి రైతుల అకౌంట్ లలో డబ్బులు పడేలా తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు.