కర్ల రాజేష్ కు న్యాయం జరిగే వరకూ ఎమ్మార్పీఎస్ ఉద్యమము ఆగదు
Mbmtelugunews//నడిగూడెం, డిసెంబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని బృందావనపురం గ్రామ లో కోదాడ గాంధీనగర్ కాలనీ చెందిన దళిత యువకుడైన కర్ల రాజేష్ మాదిగ మీద జరిగినటువంటి చిత్రహింస అత్యంత ఘోరమైనది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట విరుద్ధంగా కర్ల రాజేష్ ప్రాణాలను బలి తీసుకున్నారు. వారిపై నేటికీ కూడా కేసులు పెట్టకపోవడం అనేది పోలీసు వ్యవస్థ దళితుల పట్ల చూపుతున్న వివక్షతకు పరాకాష్ట అని అన్నారు. సాధారణ పౌరులు ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోపే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న పోలీసులు కర్ల రాజేష్ తల్లి బాధితురాలు కర్ల లలితమ్మ రెండుసార్లు లిఖితపూర్వకంగా తన కుమారునికి చావుకు చిలుకూరు ఎస్సై కోదాడ రూరల్ సీఐ కారణమని, వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే నేటికీ 20 రోజులు గడుస్తున్నా కేసు నమోదు చేయకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. రాజేష్ కు జరిగిన అన్యాయం పట్ల యావత్ దళిత సమాజం తీవ్రమైన ఆవేదనలో ఉందని, అది ఆగ్రహంగా మారకముందే ఎస్సై సిఐ ల మీద కేసు నమోదు చేసి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో…
చాతాల్ల రమేష్ మాదిగ,
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఇంజమూరి మల్లయ్య మాదిగ,
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు
పందిటి నవీన్ కుమార్ మాదిగ,
మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు
మాతంగి నాగేశ్వరరావు మాదిగ,
దున్న వంశ మాదిగ, నమ్మరు మాదిగ, లక్ష్మి, వెంకటమ్మ, ధనమ్మ, త్రినేష్, హనుమ, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.



