కామ్రేడ్ వీసాల గోవిందు కు విప్లవ జోహార్లు !
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):కొమరబండ గ్రామంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ వీసాల గోవిందు 13వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళ్లు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షుడు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ సమాజం కోసం పనిచేసి చనిపోయిన వారు చిరంజీవులై చిలకాలం వెలుగొందుతారని అన్నారు.ఆ కోవకు చెందిన వ్యక్తి కామ్రేడ్ వీసాల గోవిందు అని అన్నారు.భూమి,బుక్తి,విముక్తి కోసం సాగిన విప్లవోద్యమలలో నేను సైతం అంటూ కదిలాడని,దోపిడీ పోవాలని అవస్థలు లేని వ్యవస్థ రావాలని కోరుకున్నాడని,హుజూర్నగర్ కోదాడ ప్రాంతాలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అణగారిన పీడిత ప్రజల పక్షాన నిలబడిన నికార్సైన విప్లవకారుడని తెలియజేశారు.రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై రాజీలేని పోరాటం చేశాడని పాలకవర్గ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన గొంతుక అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసులపై హత్యాకాండ కొనసాగిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ఆపరేషన్ కగారును ఆపివేయాలని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కామల్ల సైదులు,మద్దెల వెంకన్న,కామల్ల ప్రతాప్,మద్దెల జానయ్య,కామల్ల అనంతరామయ్య,బిక్షం,సాగర్,బొబ్బయ్య,కుమారి తదితరులు పాల్గొన్నారు.