కోదాడ పట్టణ సీఐ శివశంకర్ కు మాజీ సర్పంచ్ ఎర్నేని అభినందనలు
:నేర పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు జిల్లా ఎస్పీ నర్సింహా నుండి రివార్డ్ అందుకున్న సిఐ శివశంకర్
:ప్రజలకు ఉత్తమ సేవలందించి అవార్డులు రివార్డులు పొందాలి… మాజీ సర్పంచి ఎర్నేని
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 22(ప్రతినిధి మాతంగి సురేష్): సిఐ శివ శంకర్ నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా ఎస్పీ నరసింహన్ చేతుల మీదుగా రివార్డు తీసుకోవడం అభినందనీయమని కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణ సిఐ కార్యాలయంలో ఇటీవల ఎస్పీ నుండి రివార్డు పొందిన సిఐ శివశంకర్ కు స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్లతో కలిసి ఘనంగా అభినందించి మాట్లాడారు. కోదాడ పట్టణంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయాలని కోరారు. విధి నిర్వహణలో అంకితభావం, శాంతిభద్రతలకు నిరంతర కృషి చేస్తున్న పోలీస్ అధికారులకు ప్రజల నుండి నిత్య ఆదరణ ఉంటుందన్నారు.

ప్రజలకు ఉత్తమ సేవలందించి భవిష్యత్తులో సిఐ శివశంకర్ మరెన్నో అవార్డులు రివార్డులు పొందాలని ఆకాంక్షించారు. పూలమాలలు శాలువాలతో సత్కరించి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, నమ్మాది దేవమని ప్రకాష్ బాబు, కాళిదాసు వెంకటరత్నం, భాస్కర్, ఖాజా,సాలయ్య తదితరులు పాల్గొన్నారు.



