కోదాడ మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబుకు ప్రముఖుల అభినందనలు…
:మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి వన్నె తేవాలి…..
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 17(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం చేసిన ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబును కోదాడ పట్టణ ప్రముఖులు పలువురు మంగళవారం ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ మాజీ మండల అధ్యక్షులు సాముల శివారెడ్డి మాట్లాడుతూ అపార రాజకీయ అనుభవం ఉన్న ఎర్నేని మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎంపిక కావడం ఎంతో అభినందనీయం అన్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చైర్పర్సన్ పదవికి వన్నె తేవాలన్నారు.

ఈ సందర్భంగా కుసుమ వెంకటరత్నం బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో చైర్మన్ పదవి వరించిందన్నారు.వారి సహాయ సహకారాలతో కోదాడ మున్సిపాలిటీ నీ అభివృద్ధి చేస్థామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతారామయ్య, రేస్ విద్యాసంస్థల చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి పారిశ్రామిక వేత్త గంట సత్యనారాయణ, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగా రావు, పోటు రంగారావు, మునిసిపల్ కమిషనర్ రమాదేవి, మునిసిపల్ డీఈ తదితరులు పాల్గొన్నారు.



