గిరిజా ప్రియదర్శి మరణం పట్ల కోదాడ బార్ అసోసియేషన్ తీవ్ర సంతాపం
Mbmtelugunews//కోదాడ,మే 06(ప్రతినిధి మాతంగి సురేష్):మంగళవారం నాడు కోదాడ కోర్టులో న్యాయవాదులు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ గిరిజా ప్రియదర్శిని మరణానికి సంతాపం తెలిపి,చిత్రపటానికి పూలమాలలు వేసి,మౌనం పాటించి ఘన నివాళులు అర్పించిన కోదాడ బార్ అసోసియేషన్.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శి అకాలమరణం న్యాయ రంగానికి తీరని లోటు అన్నారు.ఆమె విశాఖ జిల్లాలో జన్మించి,పెండ్లి తర్వాత లా డిగ్రీ చేసిందని,న్యాయవాదిగా నమోదు చేసుకొని,జిల్లా న్యాయమూర్తిగా ఎంపికైనారన్నారు.జిల్లా న్యాయమూర్తిగా వివిధ జిల్లాల్లో ఎనలేని సేవలందించారన్నారు.సామాన్య ప్రజలకు న్యాయాన్ని అందుబాటులోకి తేవడంలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో తనదైన ముద్ర వేసారన్నారు.ఆమె హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని పొందిన అనతికాలంలోనే న్యాయ రంగానికి గర్వకారణంగా నిలిచారన్నారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆన్లైన్లో కేసులు విని,తీర్పులిచ్చారన్నారు.ఆమె అకాల మరణం వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.న్యాయమూర్తిగా ఆమె చేసిన సేవలు,ఆమె తీర్పులు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకాన్ని బలపరిచినవే కాక,సమాజంపై సానుకూల ప్రభావం చూపినవిగా నిలిచాయన్నారు.ఈ సందర్భంగా కోదాడ బార్ అసోసియేషన్ తరపున ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.ఆమె న్యాయ సేవలు చిరస్మరణీయమవుతాయని,న్యాయవాదుల హృదయాల్లో ఆమె స్మరణ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ,ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య,కోశాధికారి కోడూరు వెంకటేశ్వరావు,సీనియర్ న్యాయవాదులు పాలేటి నాగేశ్వరరావు,సాధు శరత్ బాబు,ఈదుల కృష్ణయ్య,యడ్లపల్లి వెంకటేశ్వరరావు,ఎస్వి చలం,నవీన్,కె మురళి,ధనలక్ష్మి,షేక్ రహీం,బి గోవర్ధన్,దొడ్డ శ్రీధర్,హేమలత,యశ్వంత్ రామారావు, నాళం రాజన్న,తాటి మురళి,ఎండి రియాజ్,పాషా,నాగరాజు,శరత్ కుమార్,నాగుల్ మీరా, కోదండపాని తదితరులు పాల్గొన్నారు.