గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రజల సహకరించాలి : సర్పంచి దున్నా శ్రీనివాస్.
Mbmtelugunews//నడిగూడెం, ఆగష్టు 01(ప్రతినిధి మాతంగి సురేష్): గ్రామ సమగ్రాభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని నడిగూడెం గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ కోరారు. శనివారం నడిగూడెం గ్రామపంచాయతీ నందు నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి 2026 నుండి 2029 వరకు మూడు సంవత్సరాలలో చేపట్టే అభివృద్ధి పనులకు గ్రామ సభలో తీర్మానించడం జరిగినది. తీర్మానించిన పనులలో ప్రాధాన్యతల మేరకు ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయుటకు అన్ని పార్టీల వారు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. గత గ్రామసభలో తీర్మానించిన మేరకు నడిగూడెం గ్రామంలో ఈ నెల నాలుగో తేదీ నుండి ప్రతి మంగళవారం వారాంతపు కూరగాయల సంత ను ఏర్పాటు చేస్తున్నట్లు సంతను గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యలకా ఉమారాణి, ఉప సర్పంచి ఏలుగూరి నాగరాజ్, వార్డు సభ్యులు దున్నా లింగయ్య, దున్నా మనీషా ప్రదీప్, పోలేబోయిన విజయ నాగరాజు, మామిడి రామకృష్ణ, నాగవరపు సరస్వతి రాము, బాణాల సతీష్ కుమార్, బాలుర, బాలికల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి, కరుణ, జిపిఓ కోటయ్య, అంగన్వాడీ టీచర్లు సవిత, స్వర్ణకుమారి, శకుంతల, కవిత, ఏఎన్ఎం లు రాదా, సుజాత, ఆశా కార్యకర్తలు సునీత, సైదమ్మ, శ్రీలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ పద్మ, జూనియర్ అసిస్టెంట్ వంశీ, నాయకులు చిల్లంచర్ల సత్యనారాయణ, బాణాల నాగరాజు, కాసాని వెంకన్న, గుండు విజయ రామారావు, దున్న వెంకటేశ్వర్లు, పాతకోట్ల రాము, దాసరి శ్రీనివాస్, షేక్ జలీల్, మహమ్మద్ రఫీ, జలాలుద్దీన్, సందీప్, గ్రామస్థులు పాల్గొన్నారు..



