జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిద్దాం..
తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ
కోదాడ,ఆగష్టు 06(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:మలి దశ ఉద్యమంలో సబ్బండ వర్గాల ప్రజలను ఉద్యమం వైపు తిప్పిన నాయకుడు ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు.మంగళవారం జయశంకర్ సార్ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాయపూడి వెంకటనారాయణ మాట్లాడుతూ…నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సమైక్యవాదుల చేతిలో నలిగిపోతున్న తెలంగాణను కాపాడుకోవాలనే దృక్పథంతో జయశంకర్ సిద్ధాంతం రూపొందించారని అన్నారు.మలిదశ ఉద్యమానికి పునాది వేసిన జయశంకర్ సార్ స్పూర్తి గొప్పదని కొనియాడారు.ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్ర సరిహద్దు ప్రాంతం తెలంగాణ ముఖద్వారమైన కోదాడలో ఉద్యమ స్ఫూర్తిని చాటామన్నారు.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కోదాడ ప్రాంతం ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.సారు ఆశయ సాధనకై నిరంతరం కృషి చేస్తామన్నారు.