జర్నలిస్టు వృత్తికి వన్నె తీస్తున్న వెంకటరత్నం… ఎమ్మెల్యే పద్మావతి రేడ్డి
కోదాడ, జూన్ 27: జర్నలిస్టుగా ప్రజా దీవెన దినపత్రిక ఇంచార్జ్ బంకా వెంకటరత్నం సేవలు ప్రశంసనీయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రేడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వెంకటరత్నం జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ఆరు పదుల వయసు దాటిన అవిశ్రాంతంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే బాధ్యతమైన జర్నలిస్టు వృత్తిలో ఉంటూ వెంకటరత్నం సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వెంకటరత్నం ని ఆదర్శంగా తీసుకొని విలేకరులు జర్నలిస్టు వృత్తికి వన్నె తేవాలన్నారు. వెంకటరత్నం నిండు నూరేళ్లు జర్నలిస్టుగా సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి తినిపించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కారింగుర అంజన్న గౌడ్, సోంపం గణేష్, పెడమర్తి గాంధీ, మాతంగి సురేష్, కాసర్ల సత్యరాజు, వేపూరి సుధీర్, కుడుముల సైదులు, సంపత్, వాసు, ఆళ్లూరి చరణ్, శివ, సైదులు,నజీర్ తదితరులు పాల్గొన్నారు.