జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించిన రేస్ ఐఐటి అకాడమీ………
:ఉమ్మడి జిల్లాలోనే అత్యుత్తమ ర్యాంకులు సాధించిన రేస్ అకాడమీ……
:కార్పొరేట్ కు దీటుగా కోదాడ రేస్ కాలేజీలో అత్యుత్తమ ఫలితాలు……….
:రేస్ ఐఐటి అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి…………..
కోదాడ,ఏప్రిల్ 19(మనం న్యూస్):దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కొరకై నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఓపెన్ క్యాటగిరి సెషన్ 2 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్టు కోదాడ రేస్ ఐఐటి అకాడమీ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి తెలిపారు.శనివారం కళాశాలలో అత్యధిక పర్సంటైల్ తో పాటు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎస్.డి హుజైఫా ఆల్ ఇండియా స్థాయిలో 3,469 వ ర్యాంకు,టి రోహిత్ రెడ్డి 4,160,ఎస్ దీక్షిత 4,635వ ర్యాంకు,పి సూర్యప్రకాష్ 6,253వ ర్యాంకు,సిహెచ్ కుషాల్ సాయి స్వరూప్ రెడ్డి 8,241 ర్యాంకు సాధించారు.కాగా విద్యార్థులను తల్లిదండ్రులు,అధ్యాపకులతో కలిసి అభినందించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు స్వర్గీయ బాణాల వెంకట్ రెడ్డి ఆశయాల సాధన మేరకు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉండాలని గ్రామీణ ప్రాంత పేద,మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటు ఫీజులతో కోదాడలోనే రేస్ కళాశాల స్థాపించి కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు. పక్కా ప్రణాళిక అంకితభావంతో తమ కళాశాల అధ్యాపకులు పనిచేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నారు.గతంలో కూడా అనేక ప్రవేశ పరీక్ష ఫలితాలలో తమ రేస్ కళాశాల విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్,అధ్యాపకులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.