Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 16 (ప్రతినిధి మాతంగి సురేష్)మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో వరి కోత యంత్రం డ్రైవర్ గా పనిచేస్తున్న జానోత్ రవి హుజూర్ నగర్ వెళుతూ సీతరాంపురం వద్ద తన పర్సను పోగొట్టుకున్నాడు.ఆఫర్స్ చిలుకూరు గ్రామానికి చెందిన న్యూస్ పేపర్ ఏజెంట్ కందుకూరి శ్రీనివాసరావు కు దొరకగా స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం తెలపగా పర్సులో ఉన్న అడ్రస్ ప్రకారం బాధితుడికి ఏఎస్ఐ వెంకటేశ్వర్లు సమక్షంలో పర్సును అప్పగించారు.పర్సులో 6000 రూపాయల నగదు ఏటీఎం,పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ ఉన్నాయి.ఈ సందర్భంగా శ్రీనివాసును పోలీసులు పలువురు అభినందించారు.