నిజాయితీగా పని చేసే ఉద్యోగులకు సమాజంలో మంచి గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుంది:కోటచలం
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 29(ప్రతినిధి మాతంగి సురేష్):ఉద్యోగులు నిజాయితీగా ప్రజలకు మంచి సేవలందించినట్లయితే మంచి గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుందని సూర్యాపేట జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కోటచలం అన్నారు.శుక్రవారం పట్టణంలోని స్థానిక కిడ్స్ కళాశాలలో డిప్యూటీ డియం అండ్ హెచ్ఓ నిరంజన్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమాని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కోటచలం ముఖ్యఅతిథిగా పాల్గొని సన్మాన గ్రహీత నిరంజన్ ను గజమాల శాలువా తో సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా సర్వీస్ అయిపోయిన తర్వాత పదవి విరమణ పొందవలసిన వారేనని ఉద్యోగులు సర్వీసులో ప్రజలకు మంచి సేవలు అందించినట్లయితే సమాజంలో గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం సుదర్శన్,యతాకుల మధుబాబు,బొల్లేపల్లి భాస్కర్ రాజు,భూతరాజు,సైదులు,చెరుకు యాదగిరి,ఇందిరాల రామకృష్ణ,మధుకర్,తదితరులు పాల్గొన్నారు.