న్యాయవాదులపై దాడులను ఖండించండి…ఉయ్యాల నర్సయ్య
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 19(ప్రతినిధి మాతంగి సురేష్): న్యాయవాదులపై దాడులను ఖండించాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య కోరారు. నల్గొండలో న్యాయవాది నరేష్ కుటుంబం పై దాడి చేసిన దుండగులపై కేసు నమోదు చేసి, వెంటనే ఆరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నాడు కోర్టు విధులు బహిష్కరించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. న్యాయాన్ని రక్షించే క్రమంలో కక్షిదారులు కోసం పనిచేసే న్యాయవాదులకు ఎలాంటి పక్షపాతం ఉండదని, దానికి అసాంఘిక శక్తులు, రౌడీ మూకలు వైరిపక్ష న్యాయవాదులపై దాడులకు పాల్పడం దారుణమైన విషయమన్నారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండించాలని, ప్రభుత్వం వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, కోడూరు వెంకటేశ్వరరావు, ఎస్ నవీన్, కె మురళి, సీనియర్ న్యాయవాదులు తమ్మినేని హనుమంతరావు, వి రంగారావు, ఈదుల కృష్ణయ్య, గట్ల నర్సింహారావు, యశ్వంత్, రామారావు, బెల్లంకొండ గోవర్ధన్, పాషా, బాలయ్య, కొండ భీమయ్య, హేమలత, శిల్ప, మంద వెంకటేశ్వర్లు, పెద్దఅబ్బాయ్ , నాగరాజు, శరత్ కుమార్, రియాజ్, ప్రసాద్, సంతోష్, అవినాష్, మురళి, ఉపేందర్, చిన్నాబ్బయ్, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.



