పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం వల్ల నవజాత మరణాలను తగ్గించవచ్చు
:సర్పంచి మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 04(ప్రతినిధి మాతంగి సురేష్): పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం వల్ల నవజాత మరణాలను తగ్గించవచ్చని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు “ప్రపంచ తల్లిపాలు వారం” ను ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు. మన గ్రామంలో అంగన్వాడి టీచర్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తల్లిపాలు నవజాత శిశువుకు అత్యంత సంపూర్ణమైన మొదటి ఆహారం. దీనిని “ద్రవ స్వర్ణం” అని కూడా పిలుస్తారు. తల్లిపాలు శిశువుకు మొదటి టీకాగా పనిచేస్తాయి పుట్టుకతోనే రోగనిరోధ రోగనిరోధక శక్తిని అందించి అనేక వ్యాధుల నుండి కాపాడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అవినాష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జైసింహారెడ్డి, వార్డ్ సభ్యులు ఖాజా, రమాదేవి, అంగనవాడీ టీచర్లు షేక్ నసీమా, పి జానం, నాగమణి, హేమలత, గ్రామంలోని తల్లులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



