ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
:బిఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదు అందరివాడు
:స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్
: సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారతరత్న బిఆర్ అంబేద్కర్ జీవితం ఆయన నడిచిన విధానం ఆయన సాధించిన విజయాలు అందరికీ ఆదర్శమైనవని భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసి ఈ దేశ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పులిహోర పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచి ఎస్ కోటేశ్వరరావు, ఈ శ్రీనివాస రావు, వార్డు మెంబర్లు బండి చిన్నకోటయ్య, పిడమర్తి సూర్యనారాయణ, మడూరి కృష్ణారావు, కుర్రి వెంకన్న, ఎస్ స్రవంతి, పిడమర్తి కరుణ ఉపేందర్, జె నాగ ప్రసాద్, వి గురవయ్య, కాసాని శ్రీను, పోశం శ్రీను, వరహాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గోపి రెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రసాద్, జైపాలు, రోశయ్య, వెంకట్రావు, నాగస్వరూప్, రాము, రాంబాబు, కాంతారావు, సామేలు, రామకృష్ణ, తిరుపమ్మ, నర్సిరెడ్డి, హరి ప్రసాద్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



